నిహారిక ఎన్నికల్లో పోటీ అబద్దం
ప్రముఖ నటుడు వరుణ్ తేజ్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తప్పు పట్టారు. తాము ఎన్నికల క్యాంపెయిన్ కు రావాలా వద్దా అనేది తమ కుటుంబం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
తన సోదరి నిహారిక కొణిదెల ఎన్నికల బరిలో ఉంటుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు. వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. దానిని పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాలలో నటిస్తున్నారు. మరో సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరో సోదరుడు, నటుడు నాగ బాబు ఉన్నారు.
ఆయన తనయుడే వరుణ్ తేజ్ , కూతురు నిహారిక కొణిదెల. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కట్టారు. రాబోయే అసెంబ్లీ, శాసన సభ ఎన్నికల్లో బరిలో నిలవాలని నిర్ణయించారు. అన్ని సర్వేలు టీడీపీ, జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు.