పట్టణాల అబివృద్ది కోసం ప్ర‌త్యేక‌ నిధులు తెస్తాం

Spread the love

స్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ జిల్లా : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాలు ఉంటాయ‌ని, ఆ త‌ర్వాత అన్ని పార్టీలు క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నిజామాబాద్ మేయ‌ర్ ప‌ద‌వి కాంగ్రెస్ వ‌శ‌మైంది. ఈ సంద‌ర్బంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కూరగాయల ఉమారాణిని అభినందించారు. నగరాభివృద్ధి కోసం కృషి చేయాల్సిందిగా మేయర్ , డిప్యూటీ మేయర్ కి సూచన‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ అభివృద్ది కోసం ప్ర‌త్యేకంగా దృష్టి సారించార‌ని చెప్పారు మ‌హేష్ కుమార్ గౌడ్. ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకు వ‌చ్చే బాధ్య‌త‌ను తీసుకున్నార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కృషిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. పట్టణాల అబివృద్ది ప్రత్యేక నిధులు తెస్తామ‌ని ప్ర‌క‌టించారు మ‌హేష్ కుమార్ గౌడ్. ఇదే స‌మ‌యంలో పట్టణాల్లో అబివృద్ది కి అన్ని పార్టీ.లు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ అధిష్టానిదే ఫైన‌ల్ అని, త‌న ప్ర‌మేయం ఇందులో ఏమీ ఉండ‌ద‌న్నారు మ‌హేష్ కుమార్ గౌడ్.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *