రైతు బంధుపై మాట త‌ప్పిన స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో అడ్డ‌గోలు దందాకు తెర లేపారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్ద‌తి కాదన్నారు. గాంధీ కుటుంబానికి ఇస్తానన్న రూ.1000 కోట్లు నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొత్తా అంటూ నిప్పులు చెరిగారు. గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర వెయ్యి కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనిపై పూర్తి వివ‌రాలు వెల్ల‌డించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఇవ్వడానికే రూ.1000 కోట్లు ఉంటే, మరి ఆయన ఎన్నికోట్లు దోచుకొని దాచుకున్నాడో ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని కోరారు . కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్‌లో రైతుబంధు పడేదని అని, కానీ ఇప్పుడు మార్చి వస్తున్నా రైతుబంధు ఇవ్వడం లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. అడ్డగోలు హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసి అధికారంలోకి వ‌చ్చిన స‌ర్కార్ పూర్తిగా మాట మార్చ‌డం దారుణ‌మ‌న్నారు. రైతులకు యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు, రైతుల దగ్గర పంటలు కొనే సోయి లేదు.. కానీ గాంధీ కుటుంబానికి వేయి కోట్లు ఇస్తాన‌ని చెప్ప‌డం ప‌ట్ల తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు కేటీఆర్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *