నిరుద్యోగులపై కోదండరాం రెడ్డి గుస్సా

నా ఇంటికి ఎందుకు వ‌చ్చారంటూ ఫైర్

హైద‌రాబాద్ : తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ప్రొఫెస‌ర్ ముద్ద‌సాని కోదండరాం రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న నిరుద్యోగుల‌పై మండిప‌డ్డారు. త‌న ఇంటికి వ‌చ్చిన నిరుద్యోగ సంఘాల నాయ‌కుల‌పై భ‌గ్గుమ‌న్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఎప్పుడు ఇస్తారంటూ ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న కంట్రోల్ త‌ప్పారు. ఇంకెంత కాలం ఆగాలంటూ కోదండ రాం రెడ్డిని నిల‌దీయ‌డంతో ఆయ‌న స‌హ‌నం కోల్పోయారు. ప్ర‌భుత్వంపై మాట్లాడకుండా బాధితులైన నిరుద్యోగుల‌పై మండిప‌డడంతో అక్క‌డున్న వారంతా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. నా ఇంటికి ఎందుకు వ‌చ్చారంటూ ఫైర్ కావ‌డంతో నిరుద్యోగులు అవాక్క‌య్యారు. ఓట్ల కోసం తాను ఎప్పుడూ నిరుద్యోగుల వ‌ద్ద‌కు రాలేద‌న్నారు.

తాను ఏమైనా ప్ర‌భుత్వంలో ఉన్నానా అంటూ నిరుద్యోగ సంఘాల నేత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. త‌న‌కు మీకు ఎలాంటి సంబంధం లేదంటూ పేర్కొన్నారు. నా ఇంటికి వచ్చి అరవొద్దు అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు కోదండ‌రాం రెడ్డి. దీంతో త‌న మాట తీరు ప‌ట్ల తీవ్రంగా మండిప‌డ్డారు నిరుద్యోగ బాధితులు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో రావ‌డానికి మీరంతా క‌లిసి త‌మ‌ను మోసం చేశార‌ని ఇప్పుడు స్పందించ‌క పోతే ఎలా అని నిప్పులు చెరగారు బాధిత నిరుద్యోగులు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *