ప్రభుత్వ టీచర్ల జీతాలు త‌గ్గించాలి : ఆకునూరి ముర‌ళి

Spread the love

తెలంగాణ స‌ర్కార్ కు పూర్తి నివేదిక అంద‌జేత

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ , సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి. త‌న సార‌థ్యంలో ఏర్పాటైన క‌మిటీ గ‌త కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించింది. ఈ సంద‌ర్బంగా విద్యారంగంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వ‌స‌తుల క‌ల్ప‌న గురించి పూర్తి నివేదిక‌ను సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కె. కేశ‌వ‌రావుకు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు నివేదిక‌లో. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్ల‌కు భారీ ఎత్తున జీతాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వీరికి అంద‌జేస్తున్న వేత‌నాలు రాష్ట్ర ఖ‌జానాకు భారంగా మారుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌న్నారు.

అందుకే ప్ర‌భుత్వం వెంట‌నే ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌కు సంబంధించిన వేత‌నాల‌ను తగ్గించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. జీతాల‌తో పాటు అల‌వెన్సులు కూడా త‌గ్గించాల‌న్నారు. ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద్దీకరించాలని రేవంత్ రెడ్డికి అంద‌జేసిన నివేదిక‌లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్ప‌ష్టం చేశారు. దీంతో విద్యారంగం బలోపేతం చేయడం కష్టంగా మారుతుందన్నారు. టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా తీసి వేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *