వీహెచ్, జెట్టి కుసుమ‌కుమార్ కు ఛాన్స్ ఇవ్వండి

Spread the love

ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గేతో సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి

న్యూఢిల్లీ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. రాజ్య‌స‌భ‌కు ఖాళీ అయిన ఎంపీ స్థానాల‌లో వీ హెచ్ హ‌నుమంత రావు, జెట్టి కుసుమ‌కుమార్ కు ఇవ్వాల‌ని ఏఐసీసీ బాస్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కు విన్న‌వించారు. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు కూడా కొన‌సాగాయి. తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా మాట్లాడటం జ‌రిగింద‌న్నారు. రాహుల్ గాంధీనీ, మల్లికార్జున్ ఖర్గేని క‌లిసేందుకు వ‌చ్చాన‌ని చెప్పారు. అయితే బిజీ షెడ్యూల్ కార‌ణంగా రాహుల్ గాంధీని క‌ల‌వ‌లేక పోయాన‌ని, కానీ పార్టీ బాస్ ను క‌లిసిన‌ట్లు తెలిపారు జ‌గ్గారెడ్డి.

వారికి రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని ఖ‌ర్గేను కోరిన‌ట్లు చెప్పారు. జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్ కమ్మ సామాజిక నుంచి ఉన్నాడు, కమ్మ నాయకుడుగా అవకాశం ఇవ్వాలని కోరానని తెలిపాడు. జెట్టి కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ కుటుంబం నుంచి అందరూ కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పారు. ఇక హనుమంతరావు తెలంగాణలో అనేక ముఖ్యమంత్రులతో పని చేశారు , మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు జ‌గ్గారెడ్డి. రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారని తెలిపారు. వయసులో పెద్ద వ్యక్తి, చురుకైన వ్యక్తి కాబట్టి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరాన‌న్నాడు.

  • Related Posts

    లిక్కర్ స్కాం కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క్లీన్ చిట్

    Spread the love

    Spread the loveన్యాయ వ్య‌వ‌స్థ‌పై ఉన్న న‌మ్మ‌కం రూడీ అయ్యింది హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌కు భారీ ఊర‌ట ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన లిక్క‌ర్ స్కాం కేసులో ఎలాంటి అక్ర‌మాలు చోటు చేసుకోలేదంటూ కోర్టు తీర్పు చెప్పింది.…

    మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

    Spread the love

    Spread the loveరాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *