NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ స‌భ‌కు భారీ భ‌ద్ర‌త

Share it with your family & friends

ఏర్పాట్ల‌పై ఎస్పీ స‌మీక్ష

తిరుప‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈనెల 26న సోమ‌వారం ప‌ర్య‌టించ‌నున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టుకు రానున్నారు. ముంద‌స్తు భ‌ద్ర‌త ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు జిల్లా ఎస్పీ మ‌లిక గ‌ర్గ్, జాయింట్ క‌లెక్ట‌ర్. సీఎం టూర్ ను పుర‌స్క‌రించుకుని ఏఎస్ఎల్ పై రివ్యూ చేశారు.

జ‌గ‌న్ రెడ్డి తిరుప‌తికి చేరుకుంటారు. అక్క‌డి నుంచి చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ‌తారు. ఆదివారం రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం భద్రత పరమైన ముందస్తు ఏర్పాట్లపై (ASL) ను జిల్లా ఎస్పి మలిక గర్గ్ , జేసీ ఇత‌ర అధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా ఎక్కడా రాజి పడకుండా డేగ కన్ను లాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పటిష్ఠమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

సీఎం తిరుగు ప్రయాణం అయ్యే వరకూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి బద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయపరచుకుంటూ ప్రణాళికా బద్దంగా, సమిష్టిగా ముందుకు వెళ్లి పర్యటనకు భద్రత కల్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపీఎస్., ఏఎస్పీ లు కులశేఖర్, శ్రీనివాస రావు, ఆర్డీవో శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, డీఎస్పీ లు ఎస్బి భాస్కరరెడ్డి, రేణిగుంట భవ్య కిషోర్, డిఎంహెచ్ఓ శ్రీహరి, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.