వేణు ఎల్లమ్మ కోసం కాస్టింగ్ కాల్

Spread the love

ప్ర‌తిభ క‌లిగిన క‌ళాకారుల‌కు ఛాన్స్

హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం కాస్టింగ్ కాల్ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలో నటించేందుకు వివిధ వయసుల వారికి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా 50 నుంచి 65 ఏళ్ల వయసున్న పురుషులు, 18 నుంచి 22 ఏళ్ల వయసున్న యువతులు, అలాగే 6 నుంచి 9 ఏళ్ల వయసున్న బాలురు కావాలని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ పాత్రల ఎంపికలో రంగస్థల కళాకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని దర్శకుడు వేణు యెల్దండి స్పష్టం చేశారు.

ఆసక్తి ఉన్న నటీనటులు తమ పోర్ట్‌ఫోలియోతో పాటు, స్వీయ పరిచయం (Intro, ఒక నిమిషం నిడివి గల ఆడిషన్ క్లిప్‌ను పంపాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వివరాలను yellammaaudition@gmail.com మెయిల్‌కు లేదా 7382299560 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని సూచించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ, వేణు యెల్దండి ఎమోషనల్ మేకింగ్ కలయికలో వస్తున్న ఈ ‘ఎల్లమ్మ’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. కొత్త వారికి అవకాశం కల్పిస్తుండటంతో ఔత్సాహిక నటులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలి.

  • Related Posts

    స్వంత ఊరితో అనుబంధం శాశ్వ‌తం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న స్వ‌స్థ‌లం తెలంగాణ రాష్ట్రంలో నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం బ‌ల్మూరు మండ‌ల ప‌రిధిలోని…

    ర‌ష్మిక మంద‌న్నా మ‌జాకా

    Spread the love

    Spread the loveసోష‌ల్ మీడియాలో వైర‌ల్ హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు ఒక్క‌ట‌య్యారు న‌టీ న‌టులు ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఎవ‌రికి వారు సినిమాల‌లో న‌టిస్తూనే ఫుల్ ఎంజాయ్ చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *