400 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

జీహెచ్ ఎంసీ కాంపౌండ్‌నే పునాదిగా క‌బ్జా

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న వారికి షాక్ ఇచ్చింది. శేరిలింగంపల్లి మండ‌లం చందాన‌గ‌ర్ ప‌రిధిలోని భ‌వానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. త‌మ కాల‌నీలోని 400ల గ‌జాల పార్కు స్థ‌లం క‌బ్జాకు గురౌతోంద‌ని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు గ‌తంలో పార్కు చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించి హ‌ద్దులు నిర్ధారించార‌న్నారు.

ఆ ప్ర‌హ‌రీనే పునాదులుగా చేసి ఇల్లు క‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వాపోయారు. జీహెచ్ ఎంసీ అధికారుల‌తో హైడ్రా క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించింది. లే ఔట్ ప్ర‌కారం పార్కు స్థ‌లంగా నిర్ధారించుకుంది. ఈ మేర‌కు ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 400ల గ‌జాల స్థ‌లంచుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థ‌లంగాపేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీని విలువ రూ. 2 కోట్ల‌వ‌ర‌కూ ఉంటుంద‌ని స్థానికులు అంచ‌నా వేశారు పార్కును కాపాడిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *