స‌మస్య‌లు గాలికొదిలేశారు ఆట పాట‌ల్లో మునిగి తేలారు

ఇదేనా ప్ర‌జా ప్ర‌భుత్వం పాల‌న అంటూ మండిప‌డ్డ జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి స‌ర్కార్ నిర్వాకంపై. ఓ వైపు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రావ‌డం లేద‌న్నారు. ఆదుకోవాల్సిన స‌ర్కార్ మొద్దు నిద్ర పోతోంద‌ని మండిప‌డ్డారు. బుధ‌వారం జ‌గ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల కష్టాలు గురించి మాట్లాడటం, చర్చించడం కనీసం మచ్చుకకి కూడా కూటమి నేతలు చేయలేదన్నారు. ఓ వైపు అన్న‌దాత‌లు నానా తంటాలు ప‌డుతుంటే ఇంకో వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , మంత్రులు ఆట‌లు, పాట‌లు, స్కిట్ ల‌తో కాల‌క్షేపం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. వీళ్ల‌ను చూసి జ‌నం న‌వ్వుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

వ్యవసాయ రంగం రాష్ట్రంలో అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంక్షోభం నెలకొని అన్నదాతలు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇక నిన్న‌టి దాకా టీటీడీపై చిల్ల‌ర రాజ‌కీయం చేసిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్ కు, సీఎం, డిప్యూటీ సీఎంల‌కే ద‌క్కుతుంద‌న్నారు. జ‌నం ఛీ కొడుతున్నార‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *