రోడ్ల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాలి

ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి ప్రణాళిక‌లు త‌యారు చేయాల‌ని ఆదేశించారు. ఇవాళ క‌మాండ్ కంట్రోల్ రూమ్ వేదిక‌గా రోడ్లు, భవనాల శాఖ పై సమీక్ష నిర్వహించారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047 కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల ప్రణాళిక – అభివృద్ధి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి పై దృష్టి పెట్టాలని స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్ల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించాలని అన్నారు సీఎం. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రతిపాదించిన ఆయా ఆసుపత్రి భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *