అవినీతిమ‌యంగా మారిన ఆంధ్ర‌ప్ర‌దేశ్

నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి

తిరుప‌తి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అటు కేంద్రాన్ని, ఇటు ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎవ‌రిని ఉద్దరించేందుకు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసి యుద్ద విమానాలు కొంటున్నార‌ని ప్ర‌శ్నించారు ప్ర‌ధాన‌మంత్రి మోదీని ఉద్దేశించి.
నెహ్రూ, మన్మోహన్ సింగ్ హ‌యాంలో ప్రజల డబ్బుతో ఎన్ని యుద్ధ విమానాలు కొన్నారో చెప్పాల‌న్నారు.
యుద్ధం జరగబోయే రెండు రోజుల ముందు ప్రధాని ఇజ్రాయెల్ వెళ్లాడు. శాలువాలు కప్పించుకున్నాడు. ఆయన సాధించిన విదేశీ దౌత్య విజయాలు ఏమిటో దేశానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు చింతా మోహ‌న్.

ఇక ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఉద్దేశించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీ కి నలుగురు బ్రోకర్లు ఉన్నారని, వాళ్ళు చెప్పిన పనులే అధికారులు చేస్తున్నారని, ఫైళ్ళపై సంకాతాలు పెడుతున్నారంటూ భ‌గ్గుమ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూట‌మి స‌ర్కార్ హ‌యాంలో అవినీతిలో కూరుకు పోయిందన్నారు. పేరుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడంటూ ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కలెక్టర్లతో కాన్ఫరెన్స్, పింఛన్లు పంపిణీకే ముఖ్యమంత్రి పరిమితం అవుతున్నారంటూ ఆయ‌న వ‌ల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేద‌న్నారు చింతా మోహ‌న్. హైదరాబాద్ లో ఇంకా 50 ఏళ్ళ కామన్ క్యాపిటల్ గా వుండివుండొచ్చు. కానీ కెసిఆర్ కేసు, అరెస్టుకు భయపడి చంద్రబాబు అమరావతికి పరుగెత్తాడ‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *