జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

Spread the love

డిమాండ్ చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మ‌రోసారి కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం కోట్లాది మందికి భ‌రోసా ఇచ్చింద‌ని, ఉపాధి క‌ల్పించింద‌ని తెలిపారు. కానీ మోదీ కావాల‌ని కుట్ర ప‌న్నార‌ని, కార్పొరేట్ శ‌క్తుల‌కు మేలు చేకూర్చేలా జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కానికి మంగ‌ళం పాడేందుకు కొత్త చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట(MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు కాకినాడ జిల్లాలో సాగింది. జగ్గంపేట నియోజక వర్గం లోని కాట్రావుల పల్లి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజర‌య్యారు.

మన్రేగా పథకం తీరుతెన్నులను వివరించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. గత 11 ఏళ్లుగా ఉపాధి హామీ పథకంపై మోడీ చేసిన కుట్రలను బ‌య‌ట పెట్టారు. చేసిన పనులకు వేతనాలు ఇవ్వకుండా, అడిగితే జాబ్ కార్డులు తొలగిస్తూ, రెండు మూడు వారాలు కూడా పని కల్పించకుండా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ తెచ్చిన అక్రమ చట్టం VB G- RAM G ద్వారా జరిగే నష్టాన్ని వివరించి, మన్రేగా పథకం పునరుద్ధరణకు జగ్గంపేట ప్రజల మద్దతు కూడగట్టడం జరిగింది. రచ్చబండ వేదికగా గ్రామస్థులు గత YCP ప్రభుత్వం ఇండ్ల స్థలాల పేరుతో చేసిన మోసాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో చేస్తున్న దారుణాల‌ను ఎండ‌గట్టారు ష‌ర్మిలా రెడ్డి.

  • Related Posts

    ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ద‌మైంది

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్ పై భ‌గ్గుమ‌న్నారు.తాము చేస్తున్న దాడులకు భయపడి పోయి ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ధమైందని అన్నారు. 2…

    ప‌య్యావుల ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి

    Spread the love

    Spread the loveమాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు అమ‌రావ‌తి : మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ కొట్టిపారేశారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోపించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *