శాంతి, సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తిబింబం రంజాన్

Spread the love

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు

హైద‌రాబాద్ : ప‌ర‌మ‌త స‌హ‌నం, శాంతి సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు యుద్ధాలు, ఘర్షణలతో సతమతమవుతుంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ స‌మ‌ర్థ నాయకత్వంలో మన భారతదేశం శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు.

“సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్” అనే మూల మంత్రంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంద‌ని చెప్పారు రాంచంద‌ర్ రావు. కుల, మత, వర్గ భేదాలకు తావులేకుండా దేశంలోని ప్రతి పౌరుడి సంక్షేమమే ధ్యేయంగా మోదీ పాలన సాగుతోందన్నారు. యావ‌త్ ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ దేశాల‌న్నీ మోదీ పాల‌న గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారంటూ స్ప‌ష్టం చేశారు. భార‌త దేశం స‌త్తా ఏమిటో ఇప్ప‌టికే ప‌క్క దేశాల‌కు తెలిసి పోయింద‌న్నారు. నిన్న‌టి దాకా క‌య్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించిన ఘ‌న‌త మోదీకే ద‌క్క‌తుంద‌న్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు , రాష్ట్ర పార్టీ పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీల‌కు ఉపాధి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ…

    ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన డిప్య‌టీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *