ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వ‌ర్షాలు

మ‌రో మూడు రోజుల పాటు కురుస్తాయి

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అకాల వ‌ర్షాలు ముంచెత్తాయి. ఇప్ప‌టికే ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు భారీ ఎత్తున పంట న‌ష్టం వాటిల్లింది. ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. సీఎం ఉన్న‌త‌స్థాయి సమీక్ష చేప‌ట్టారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. మ‌రో వైపు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. అవ‌స‌ర‌మైతే త‌ప్పా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయ‌ని తెలిపింది.

రాత్రికి కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పేర్కొంది. ఎల్లుండి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రావ‌చ్చ‌ని పేర్కొంది. అకాల వర్షాల నేపథ్యంలో మినుము, మిరప, పసుపు ఇతర పంటలను తడవకుండా భద్రపరుచు కోవాల‌ని తెలిపింది

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *