వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ బిగ్ షాక్

చ‌లాన్లు క‌ట్ట‌క‌పోతే జ‌రిమానా త‌ప్ప‌దు

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు సంబంధించి వాహ‌న‌దారులు జాగ్ర‌త్త వ‌హించ‌క పోతే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్ అవుతుంద‌ని హెచ్చ‌రించింది. కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలిపేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పోలీస్ యంత్రాంగం.

వాహనదారుడి ఫిర్యాదును పరిశీలించి, అధికారులు నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అంగీకరిస్తే 30 రోజుల్లో చలాన్ కట్టాల్సి ఉంటుంది. లేదంటే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్లొచ్చని, కోర్టుకు వెళ్లకపోతే చలాన్ కట్టడానికి 15 రోజులు గడువు ఇచ్చేవిధంగా నిబంధనలు అమలు చేసేలా ప్రణాళికకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఫిర్యాదు గురించి పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా, వాహనానికి సంబంధించిన అన్ని ఆర్టీఏ సేవలు డీ–యాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు తీసుకు రానుంది. ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న పోలీస్ శాఖ .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *