త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో బీసీ మంత్రులు, హోం మంత్రి సవిత, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి సవిత విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి పాటు పడుతోందన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2025-26 బడ్జెట్ లో రూ.47 వేల కోట్లకుపైగా కేటాయించారన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూప కల్పనకు నిర్ణయించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం మేర బీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం బీసీ మంత్రులు రెండు పర్యాయాలు సమావేశమయ్యామని, త్వరలో మరో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బీసీలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీలోని బీసీ నాయకులను అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామన్నారు.

  • Related Posts

    కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *