స్వంత పార్టీ నేత‌లే గోతులు త‌వ్వితే ఎలా..?

నిప్పులు చెరిగిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఆయ‌న అధ్య‌క్షుడు రామ్ చంద‌ర్ రావు, కేంద్ర మంత్రి గంగ‌గాపురం కిష‌న్ రెడ్డిల స‌మ‌క్షంలోనే నిప్పులు చెరిగారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు . ఇలాంటి చిల్ల‌ర మ‌ల్ల‌ర వేషాలు వేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అనేది ఒక‌టి ఉంటుంద‌ని, ఆ దిశ‌గా న‌డుచుకోక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో నాకు ఇప్పటికి సమాచారం లేదని ఆరోపించారు. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అని నిలదీశారు ఈట‌ల రాజేంద‌ర్.

పార్టీ నిర్ణయాల్లో నాకు కనీసం సమాచారం అందడం లేదని మండిప‌డ్డారు. సీనియర్ నేతగా నాకు ఒక గుర్తింపు ఉంద‌న్నారు. పార్టీ దాన్ని కాపాడ కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి సోషల్ మీడియాలో నాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ వెనకాల బీజేపీ పార్టీ నేతలే ఉన్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . సొంత పార్టీ నేతలే నాపై నెగెటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుల ముందే ఈటెల రాజేందర్ ఫైర్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *