ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ అంటే రోడ్ల‌పై నిల్చువ‌డ‌మేనా..?

Spread the love

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శాంత్ కిషోర్ ఫైర్

బీహార్ : జన్ సురాజ్ పార్టీ అధినేత, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న ఆయ‌న బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. దేశం సంక్షోభంలో నెల‌కొన్న ప్ర‌తి స‌మ‌యంలో త‌ను ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అంటూ చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. జన నాయ‌కుడు క్లిష్ట స‌మ‌యంలో స‌మ‌య స్పూర్తితో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుకుంటార‌ని, కానీ ప్ర‌ధాన‌మంత్రికి త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నం చేయ‌డం త‌ప్పితే దేశంపై ప్రేమ లేద‌ని ఆరోపించారు ప్ర‌శాంత్ కిషోర్. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు పీకే.

గత 12 ఏళ్లుగా ‘ఆత్మనిర్భర్ భారత్’ అని ప్రధాని మోదీ పదే పదే చెప్తూ వస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడేమో.. యుద్ధం మొదలైన 5-7 రోజుల్లోనే భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ముంద‌స్తు ఆలోచ‌న చేయ‌కుండా ఇప్పుడు ఆత్మ నిర్బ‌ర్ అంటే ఎలా అని నిల‌దీశారు. దేశాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్’ చేసేందుకు ప్రజలు ఓసారి నోట్ల కోసం క్యూలో నిల్చున్నారని, మ‌రోసారి కొవిడ్ లైన్‌లో నిల్చున్నారు.. రూ.50 పెట్రోల్‌కు రూ.100 వరకు కడుతూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇంకెంత కాలం ఈ స‌మ‌స్య‌ల‌ను భ‌రించాల‌ని మండిప‌డ్డారు ప్ర‌శాంత్ కిషోర్.

  • Related Posts

    నీటి పారుద‌ల వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయాలి

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌న్న బండారు శ్రావ‌ణి శ్రీ‌ అనంత‌పురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) ,…

    మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం బాధాక‌రం

    Spread the love

    Spread the loveసంతాపం వ్య‌క్తం చేసిన మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి : మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నిర్మ‌ల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును అతి వేగంగా వ‌స్తున్న టిప్ప‌ర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *