స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

Spread the love

నిమ్మ‌ల రామానాయుడు ప‌లువురికి ఆద‌ర్శ‌ప్రాయం
పశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప‌లువు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లు లో ప‌ర్య‌టించారు. పాలకొల్లులోని క్రిస్టియన్ స్మశాన వాటిక పనుల్లో శ్రమదానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంటు ను గమేళాలతో మోసి,స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ప్రతి ఆదివారం నియోజకవర్గం లో స్మశానాల అభివృద్ధి పనుల్లో శ్రమధానం చేస్తూ వ‌స్తున్నారు. దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తూ ఉండ‌డం విశేషం.

పాలకొల్లు నియోజకవర్గంలో అన్ని స్మశాన వాటికలను సుందరవన పార్కులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో, చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీ స్మశాన వాటిక అంతే ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు.
స్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. స్మశాన వాటిక పనుల్లో అధికారులకు, ఏజెన్సీకి పలు సూచనలు చేశారు మంత్రి. .

  • Related Posts

    బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో…

    ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో సీఎం భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క రంగాల‌లో స‌హ‌కారం పై చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస్ట్రేలియా హై క‌మిష‌న‌ర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీల‌క రంగాల‌లో స‌హ‌కారంపై చ‌ర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *