సీఎం రేవంత్ రెడ్డితో మేన‌కా గాంధీ భేటీ

సామాజిక సేవ‌లు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి

హైద‌రాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు . గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు ఈ సంద‌ర్బంగా సీఎం.

ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్ధాపన చేశామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం జంతు సంరక్షణ విషయంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల ప‌ట్ల మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణా రావు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *