11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్

Spread the love

బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చిన మార్ష‌ల్స్

హైద‌రాబాద్ : తెలంగాణ శాసన మండలి నుంచి 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స‌స్పెండ్ అయ్యారు. సోమవారం ఉదయం సమావేశాలు తిరిగి ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, సభ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. సభలో నిరసన తెలిపినందుకు హైదరాబాద్‌లోని తెలంగాణ శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ బయటకు తీసుకు వ‌చ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన విషయంపై విచారణ జరిపేందుకు ఒక సభా కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.

దీంతో సభకు అంతరాయం కలిగించినందుకు 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తెలంగాణ శాసన మండలి నుంచి సస్పెండ్ చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి సభ్యులను తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లి, సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలని పదేపదే కోరారు. అయినా బేఖాత‌ర్ చేశారు. దీంతో వారు వెనక్కి తగ్గక పోవడంతో, శాసన వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ విషయమై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం, ఛైర్మన్ వారిని ఆ రోజుకు సస్పెన్షన్‌లో ఉంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

  • Related Posts

    సీఎం రేవంత్ రెడ్డితో మేన‌కా గాంధీ భేటీ

    Spread the love

    Spread the loveసామాజిక సేవ‌లు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి హైద‌రాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా…

    దోపిడి, విధ్వంసమే జగన్ క్రెడిట్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి ఎస్. స‌విత‌. ఆర్డీటీ విష‌యంలోక్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వానుద్దేశించి జగన్ తరుచుగా విమర్శించడంపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *