చంద్ర‌బాబు, జ‌గ‌న్ మౌనం ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం

ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు కేంద్రం అన్యాయం

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై. తాజాగా ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉంద‌న్నారు. ఈ దేశంలో మ‌తం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టి బీజేపీ ల‌బ్ది పొందాల‌ని చూస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ⁠మిగిలిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బ్రతకాలని బీజేపీ చూస్తోంద‌ని ఆరోపించారు. ⁠బీజేపీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచే ఇదే వైఖరి అనుస‌రిస్తోంద‌న్నారు. మతం పేరుతో విభజించాలి . మంటలు పెట్టాలి .. చలి కాచుకోవాలి ఇదే కొన‌సాగిస్తోంద‌న్నారు. ⁠మణిపూర్ , గోద్రా ఘటనలు ఇందుకు నిదర్శనం అన్నారు. ⁠జనాలను విడదీసి లబ్ధి పొందాలని బీజేపీ చేస్తోంద‌ని మండిప‌డ్డారు. తాజాగా ⁠సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా బీజేపీ కుట్రలో భాగమేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

⁠ఎన్నికల్లో చంద్రబాబు దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇప్పిస్తా అన్నారని, ⁠కట్టుబడి ఉన్నామని చెప్పారు
⁠మరి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. బిజెపి చేతిలో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఉన్నాయ‌ని, ఇప్పుడు సుప్రీం కోర్టును కూడా బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందా? ఈ తీర్పు ద్వారా అనిపిస్తోంద‌న్నారు. ⁠ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నోరు విప్పక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ⁠చంద్రబాబు ను దళితుల పక్షం అని ఎలా అనుకోవాల‌ని అన్నారు. ఇక జగన్ కూడా దళితుల పక్షం అని ఈ తీర్పుపై నోరు విప్పలేదన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బీజేపీ కి దత్తపుతుడుగా ఉన్నారు. ⁠బీజేపీ బిల్లులకు , నిర్ణయాలకు మద్దతు ఇచ్చారు .రాష్ట్రంలో దళిత క్రిస్రియన్లు YCP కి ఓటేశారు. ⁠ఇపుడు మోదీ దగ్గరకు మీ ఎంపీలను తీసుకు వెళ్లి అడగలేరా అని నిల‌దీశారు ష‌ర్మిలా రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *