చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత‌

నేత‌న్న‌ల‌ను నిర్లక్ష్యం చేసిన జ‌గన్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ నేత‌న్న‌ల‌కు చేయూత ఇస్తోంద‌ని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. బుధ‌వారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా నక్కపల్లిలో మంత్రికి ఘన స్వాగతం పలికారు మహిళలు. నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పింఛనలు పంపిణీ చేశారు. వారి యోగ‌క్షేమాలు అడిగారు. నేతన్న జీవితాల్లో సరి కొత్త వెలుగులంటూ కరపత్రాలతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ స్కీంను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు వంగ‌ల‌పూడి అనిత‌.

అనంత‌రం చేనేత కార్మికులతో మాట్లాడారు. వారితో క‌లిసి మ‌గ్గాన్ని నేశారు. ఇదే స‌మ‌యంలో చేనేత కార్మికురాలి వ‌ద్ద చీర‌ను కొనుగోలు చేశారు. కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించి, చేనేత కార్మికులకు ఆదాయం పెరిగేలా చేయడమే త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అక్క‌డి నుంచి నేరుగా అప్పల పాయకరావుపేట గ్రామాని వెళ్లారు మంత్రి. ల‌బ్దిదారుల‌కు పింఛన్లు పంపిణీ చేశారు. బోదుగలం సమీపంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *