కూటమి రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం

Spread the love

రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌

అమ‌రావ‌తి : వైసీపీ పాలనలో నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. పాడైపోయిన వీధి బల్బులను సైతం మార్చడానికి కూడా వీలుండేది కాదన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక పోవడంతో ఎందరో వైసీపీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాపోయారు. మరెందరో చేసిన అప్పులు తీర్చడానికి కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఆనాటి జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించారన్నారు. పంచాయతీలను దౌర్జన్యంగా గెలిపించు కోవడంలో ఉన్న శ్రద్ధ నిధులు ఇవ్వడంపై లేదని జగన్ నుద్దేశించి విమర్శించారు.

కూటమి ప్రభుత్వం రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం ప్రారంభమైందని చెప్పారు మంత్రి ఎస్. స‌విత‌. కేంద ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు నేరుగా పంచాయతీలకే అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలో గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి చోటు చేసుకుందన్నారు. 2025-26కు సంబంధించి గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి గానూ ప్రతిష్టాత్మక అయిదు కేంద్ర ప్రభుత్వ అవార్డులను ఏపీ పంచాయతీరాజ్ శాఖ గెలుచుకుందని తెలిపారు. ఇదీ కూటమి ప్రభుత్వం పాలనకు మచ్చుతునక అని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    నా వ‌ల్లే హైద‌రాబాద్ డెవ‌ల‌ప్ అయ్యింది

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి హైద‌రాబాద్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను చేసిన కృషి వ‌ల్ల‌నే అభివృద్ది చెందింద‌ని అన్నారు. నాలెడ్జి ఎకానమీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు…

    కొండాపూర్ పబ్ దాడిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

    Spread the love

    Spread the loveమొత్తం 64 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన పోలీసులు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో మ‌రో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని కొండాపూర్ ప‌బ్ లో రాత్రి పోలీసులు ఆక‌స్మిక దాడి చేశారు. మొత్తం 64 మందికి ప‌రీక్ష‌లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *