
ఆర్మీ చీఫ్ మునీర్ పై సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధానమంత్రి , మాజీ క్రికెట్ జట్టు స్కిప్పర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిఫ్ మునీర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు తన భార్య మధ్య పొరపొచ్చాలు సృష్టించి పబ్బం గడుపుకునేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. భార్యభర్తలను తీవ్రంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ తో పాటు తన భార్యకు కోర్టు శిక్ష విధించింది. ఆయనతో పాటు భార్య కూడా జైలులో చేరింది. తామిద్దరని కలుసు కోనీయకుండా చేస్తున్నారని వాపోయాడు. మొత్తంగా లొంగి పోయేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అసిఫ్ మునీర్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. తను ఒక్కడే దేశానికి చీఫ్ అయినట్లు వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు. గత రెండు సంవత్సరాలుగా జైలులోనే జీవితం గడుపుతున్నారు. తన వయసు ఇప్పుడు 72 ఏళ్లు. తనను , తన భార్యను కావాలని వేధింపులకు గురి చేయడం వల్ల తట్టుకోలేక పోతున్నామని, జైలులోనే తుద ముట్టించేలా ఆర్మీ చీఫ్ వ్యవహరిస్తున్నాడని, ఈ మేరకు లోపాయికారిగా ప్లాన్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆఫ్గనిస్తాన్ పై కావాలని ఆర్మీని ఉసిగొల్పాడని , ఆ తర్వాత డ్రోన్లను ప్రయోగించాడని ఫైర్ అయ్యారు. ఇలాగే తను వ్యవహరిస్తే పాకిస్తాన్ మరో 100 ఏళ్లు వెనక్కి వెళుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు.