
21 పరుగుల తేడాతో ఓమన్ పరాజయం
దుబాయ్ : ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. జట్టుకు వరుసగా ఇది మూడో గెలుపు . కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 188 రన్స్ చేసింది. సంజూ శాంసన్ 56 రన్స్ చేయగా, జితేష్ శర్మ, పటేల్, తిలక్ వర్మలు తమదైన శైలిలో రాణించారు. అనంతరం బరిలోకి దిగి ఓమన్ 4 వికెట్లు కోల్పోయి 167 రన్స్ కే పరిమితమైంది. దీంతో ఇండియా 21 రన్స్ తేడాతో విజయం సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్ చెరో వికెట్ తీయగా మరో ఆటగాడు రనౌట్ గా వెనుదిరిగాడు. మైదానంలోకి వచ్చిన వెంటనే శుభ్ మన్ గిల్ నిరాశ పరిచాడు. తను 8 బంతులు ఎదుర్కొని 5 రన్స్ చేశాడు. జితేష్ శర్మ మరోసారి రెచ్చి పోయాడు. తనతో పాటు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ శాంసన్. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎక్కడా తొణక లేదు. కళ్లు చెదిరే సిక్స్ లు కొట్టాడు. తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తను 3 సిక్సులు 3 ఫోర్లు కొట్టాడు. 56 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో అర్ష్ దీప్ సింగ్ రికార్డ్ సృష్టించాడు. భారత జట్టు తరపున టి20 ఫార్మాట్ లో 100 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా నిలిచాడు.
189 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఓమన్ చివరి దాకా భారత జట్టుకు చుక్కలు చూపించింది. కెప్టెన్ జతీందర్ సింగ్ 33 బంతుల్లో 32 పరుగులు చేయగా సహ ఓపెనర్ ఆమిర్ కలీమ్ 46 బంతుల్లో 64 రన్స్ తో సూపర్ షో చేశాడు. హమ్మద్ మీర్జా 34 బంతుల్లో 51 రన్స్ తో ఆకట్టుకున్నాడు. చివరి వరకు ఓమన్ ఆటగాళ్లు పోరాడడారు.