మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్

ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఉద్రిక్తత‌

వికారాబాద్ జిల్లా : ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగ‌ళ‌వారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామ‌ని ప్ర‌క‌టించింది బీఆర్ఎస్. బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న మాజీ మంత్రులు హ‌రీశ్ రావు, స‌బితా ఇంద్రారెడ్డిల‌ను హైద‌రాబాద్ లో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు పోలీసులు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు.

ఇదిలా ఉండ‌గా మాజీ ఎమ్మెల్యే మ‌హేష్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పరిగి నియోజకవర్గం కడ్లాపూర్ గ్రామంలో రైతుల బాధలు వినడానికి మీటింగ్ పెట్టుకున్నా మన్నారు. అక్కడికి పోలీసులు వెళ్లి రైతులని ఆరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. టెంటును కూల్చేశారని మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు మ‌హేష్ రెడ్డి. మ‌రో వైపు ఎమ్మెల్యే హరీష్ రావును అప్పా జంక్షన్ వద్ద అడ్డుకున్నారు ఖాకీలు. ఆయ‌న వాహ‌నాల‌కు అడ్డంగా నిలిపారు లారీల‌ను.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *