newsseals.com
News

సీఎంతో జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ర‌చాల‌నం

VijayaBhaskar April 7, 2026
newsseals-JCDivakarReddy
Spread the love

సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా

అనంత‌పురం జిల్లా : అనంత‌పురం జిల్లాలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న తాడిప‌త్రి వేదిక‌గా దీనిని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌లో పాల్గొన్నారు. అంత‌కు ముందు ఊహించ‌ని విధంగా త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి, స్నేహితుడైన రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన జేసీ దివాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య 40 సంవ‌త్స‌రాల అనుబంధం ఉంది. ఇద్ద‌రూ రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు. ఒక‌నాడు తెలుగుదేశం పార్టీలో కింగ్ పిన్ గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు చంద్ర‌బాబు.

ఇదే క్ర‌మంలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో పాటు గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌మ‌యంలో ముఖ్య భూమిక పోషించాడు జేసీ దివాక‌ర్ రెడ్డి. రాయ‌ల‌సీమ‌లో దివంగ‌త మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర‌, జేసీ ఫ్యామిలీకి మ‌ధ్య విభేదాలు ఉండేవి. కానీ రాజ‌కీయాల‌లో శాశ్వ‌త మిత్రులు శ‌త్ర‌వులు ఉండ‌ర‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో జేసీ కుటుంబం అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంది. ప‌రిటాల ఫ్యామిలీని, జేసీ ఫ్యామిలీని ఒకేచోట చేర్చ‌డంలో చంద్రబాబు నాయుడు స‌క్సెస్ అయ్యారు. దీంతో ఇవాళ ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లుసు కోవ‌డం, ఆనాటి రాజ‌కీయ ప‌ర‌మైన జ్ఞాప‌కాల‌ను పంచుకోవ‌డం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.