టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ

ఎడప్పాడిలో నామినేషన్ రద్దు

చెన్నై : ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈనెల 23వ తేదీన త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే పార్టీ పోటీ ప‌డుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా పార్టీ అధ్యక్షుడు, ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ రెండు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో బ‌రిలో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా టీవీకే పార్టీకి చెందిన అభ్య‌ర్థి దాఖ‌లు చేసిన పిటిష‌న్ చెల్లదంటూ ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఇది బిగ్ షాక్ క‌లిగించింది పార్టీ చీఫ్ కు.

ఇదిలా ఉండ‌గా ఎడప్పాడిలో నామినేషన్‌ రద్దు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఎన్నికల ముందే ఒక సీటు కోల్పోయిన విజయ్‌ టీవీకే పార్టీ. కాగా ఇక్క‌డ టీవీకే త‌ర‌పున బ‌రిలో ఉన్న‌ అభ్యర్థి అరుణ్‌ కుమార్‌ నామినేషన్‌ను, ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్‌ కూడా రద్దు చేసింది రాష్ట్రం ఎన్నిక‌ల సంఘం. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు అవసరం పోటీ చేయాలంటే. కాగా నామినేష‌న్ లో అభ్యర్థి అరుణ్‌ కుమార్‌ కేవలం 8 సంతకాలు ఉండగా మరో అభ్యర్థి నిత్యకు 7 సంతకాలు మాత్రమే ఉండటంతో తిరస్కరించిన‌ట్లు తెలిపింది ఈసీ.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *