జైస్వాల్ , సూర్య‌వంశీ జోడీ సూప‌ర్

Spread the love

ప్ర‌శంసించిన కెప్టెన్ రియాన్ ప‌రాగ్

గౌహ‌తి: ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో గెలుపొందింది. తాజాగా అత్యంత బ‌ల‌మైన పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. వ‌ర్షం కార‌ణంగా లీగ్ మ్యాచ్ ను అంపైర్లు కేవ‌లం 11 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఈ మ్యాచ్ లో యంగ్ స్టార్స్ య‌శ‌స్వి జైశ్వాల్ , వైభ‌వ్ సూర్య‌వంశీలు ముంబై బౌల‌ర్ల‌కు షాక్ ఇచ్చారు. క‌ళ్లు చెదిరే షాట్స్ ఇచ్చారు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత‌, నిర్దేశించిన ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 150 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును 27 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో ఐపీఎల్ లో వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు విజ‌యం సాధించ‌డం విశేషం. దీంతో ఆరు పాయింట్ల‌తో టోర్నీలో టాప్ లో నిలిచింది.

ఈ సంద‌ర్భంగా కెప్టెన్ రియాన్ ప‌రాగ్ మీడియాతో మాట్లాడారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఏ జట్టుకు లేన‌టువంటి ఓపెనింగ్ జోడి త‌మ‌కు ఉండ‌డం వ‌ల్ల‌నే జ‌రిగింద‌న్నాడు. జైశ్వాల్, సూర్య‌వంశీల ఆడుతున్న తీరు అద్భుతం అని ప్ర‌శంసించాడు. జైస్వాల్ 32 బంతుల్లో 10 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, సూర్యవంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేసి RRకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఈ ఇద్ద‌రినీ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా అభివర్ణించాడు. వారి నైపుణ్యం, పరిణితి, నిలకడను ప్రశంసిస్తూ, సూర్యవంశీ ఆల్‌రౌండ్ సామర్థ్యాన్ని, జైస్వాల్ అనుభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

  • Related Posts

    సంజు శాంస‌న్ పూర్ ప‌ర్ ఫార్మెన్స్

    Spread the love

    Spread the loveవ‌రుస వైఫ‌ల్యాల‌తో ఫ్యాన్స్ ఆగ్ర‌హం చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోగా గుర్తింపు పొందిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ తీవ్ర విమర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. త‌న‌ను ఏరికోరి చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం తీసుకుంది.…

    నాలో ఇంకా ఆడే స‌త్తా ఉంది : ష‌మీ

    Spread the love

    Spread the loveసెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ పై ఆగ్ర‌హం కోల్ క‌తా : భార‌త క్రికెట్ కు చెందిన ఆల్ రౌండ‌ర్, స్టార్ పేస‌ర్ మొహ‌హ్మ‌ద్ ష‌మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను మ‌రోసారి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *