బాధితుల‌కు న్యాయం చేస్తాం :హోం మంత్రి

Spread the love

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్య‌క్రమం

అమరావ‌తి : బాధితులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్ సెల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆమె వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి హోంమంత్రి గారు అక్కడికక్కడే స్పందించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలపై సంబంధిత జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్టాడారు.

ఈ సంద‌ర్బంగ‌గా బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. పోలీస్ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, బాధితులు మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పలువురు సామాన్యులు తమ భూములను కబ్జా చేశారని, పోలీసుల సహాయం అందడం లేదని మొర పెట్టుకున్నారు. మహిళలపై జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై ఫిర్యాదులు రాగా.. మహిళా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    చెరువులు మాయం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ఆస‌రాగా చేసుకుని ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లి ప‌రిస‌రాల్లో నాలుగైదు…

    తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం

    Spread the love

    Spread the loveజాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అమ‌రావ‌తి : కార్య‌క‌ర్త‌లు టీడీపీకి బ‌ల‌గ‌మ‌ని మీరు లేకపోతే పార్టీ లేద‌న్నారు రాష్ట్ర టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. కష్టపడిన వారిని గుర్తించాలనేది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *