చెరువులు మాయం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ఆస‌రాగా చేసుకుని ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లి ప‌రిస‌రాల్లో నాలుగైదు చెరువులు మాయ‌మ‌య్యాయ‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు పెద్ద ఎత్తు దీనిపై తీవ్రంగా స్పందించారు క‌మిష‌న‌ర్. ఒంగోని కుంట‌, క‌న‌క‌య్య‌కుంట‌, మ‌ర్రివాణికుంట‌, ఎర్ర‌కుంటలో కొన్నిటిని పూర్తిగా ఆక్ర‌మించ‌డాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడారు.

ఇక్క‌డి చెరువులు, వ‌ర‌ద కాలువ‌ల గురించి పూర్తి స‌మాచారం సేక‌రించాల‌ని సూచించారు ఏవీ రంగ‌నాథ్. ఈ చెరువుల‌ను క‌లుపుతూ సాగే వ‌ర‌ద కాలువ‌ల‌ను క‌బ్జా చేయ‌డం లేదంటే ఇష్టానుసారం మూసేయ‌డంతో వ‌ర్షాకాలం వ‌ర‌ద ఎటు వెళ్లాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో నివాసాలు నీట మునుగు తున్నాయ‌నే ఫిర్యాదుల‌ను కూడా ప‌రిశీలించారు. ఆక్ర‌మ‌ణ‌దారుల‌తో స‌మావేశాన్ని కూడా ఏర్పాటు చేసి క‌బ్జాల‌ను తొల‌గించాల‌ని సూచిస్తామ‌ని అన్నారు. లేని ప‌క్షంలో హైడ్రా నేరుగా రంగంలోకి దిగుతుంద‌ని స్థానికుల‌కు స్ప‌ష్టం చేశారు. పూర్తి స్థాయిలో స‌మాచారం సేక‌రించాల‌ని హైడ్రా అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *