సీఎస్ఆర్ నిధుల కోసం ప్ర‌త్యేక పాల‌సీ

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీపై ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీల CSR (corporate social responsibility) నిధుల వ్యయం, వినియోగం పై ఆయా కంపెనీల యాజమాన్యాలతో సమావేశమై, చర్చించారు. CSR కింద చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం గా భావించాలని వారిని కోరారు. నిధుల వ్యయంలో తమకు ఆసక్తి ఉన్న రంగాలతో పాటు విద్య, వైద్య, జల సంరక్షణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

CSR నిధుల విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన పాలసీని రూపొందించ బోతున్నదని ప్ర‌క‌టించారు . కంపెనీలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్ల‌డించారు సీఎం. నిధుల విషయంలో ఇలా బాధ్యతగా గతంలో ఏ ప్రభుత్వం తమతో సంప్రదించ లేదని, ఇది మంచి సాంప్రదాయమని కంపెనీల ప్రతినిధులు ఈ సంద‌ర్బంగా అభిప్రాయపడ్డారు. సీఎస్ఆర్ నిధుల విష‌యంలో తాము క‌చ్చితంగా ఉంటామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించి అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉండేలా సీఎస్ఆర్ పాల‌సీని రూపొందించాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *