అస్సాం సీఎం కామెంట్స్ బ‌క్వాస్ : ప్రియాంక్ ఖ‌ర్గే

ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు స‌వాలక్ష అబ‌ద్దాలు

క‌ర్ణాట‌క : క‌ర్టాట‌క రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌ను ఏకి పారేశారు. ఆయ‌న ఇవాళ క‌ల‌బురుగిలో మీడియాతో మాట్లాడారు. సీఎం తాను గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాన‌న్న సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు ప్రియాంక్ ఖ‌ర్గే. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. హిమంత బిస్వా శర్మ ఒక విషయం మర్చి పోయారని నేను అనుకుంటున్నాను అని అన్నారు. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండేవారు, ఇక్కడే శిక్షణ పొందారు, మనలో ఒక భాగంగా ఉండేవారని పేర్కొన్నారు.

ఆ సమయంలో సిద్ధాంతం బాగుండేది, కాంగ్రెస్ చెప్పిందేదైనా బాగుండేది, రాహుల్ గాంధీ కూడా బాగానే ఉండేవారు. ఇప్పుడు, ఈడీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి తన కుటుంబాన్ని కాపాడు కోవడానికి, ఆయన బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. పవన్ ఖేరా చేసిన ఆరోపణలకు శ‌ర్మ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్ర‌శ్నించారు.? ఖర్గేను ఎందుకు తీసుకు వస్తున్నారు?… వారే బంగ్లాదేశీయులను దేశంలోకి అనుమతిస్తున్నారని నిప్పులు చెరిగారు., ప్రభుత్వ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు ప్రియాంక్ ఖ‌ర్గే. వేర్వేరు పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నారు, అలాంటిది మీరు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆశిస్తున్నారా అని ఎదురు ప్ర‌శ్న వేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *