ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు

Spread the love

స్ప‌ష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమ‌రావ‌తి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సహచర మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపై కూలంకుషంగా చర్చించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. అలాగే రాజధానిలో హైటెన్షన్ లైన్లు మార్పిడిపై అధికారులు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని సూచించారు.

ముఖ్యంగా న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశామ‌న్నారు గొట్టిపాటి ర‌వికుమార్, పొంగూరు నారాయ‌ణ‌. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు , సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    జీవ‌న్ రెడ్డిని చూసి జ‌నం న‌వ్వుకుంటున్నారు

    Spread the love

    Spread the loveఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండ‌డం ప‌ట్ల స్పందించారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. శ‌నివారం ఆయ‌న మీడియాతో…

    ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలుగుదేశం పార్టీ మ‌హానాడు

    Spread the love

    Spread the loveనిర్వ‌హిస్తామ‌న్న పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అమ‌రావ‌తి : ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసారి భారీ ఎత్తున మ‌హానాడు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళతెలుగుదేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *