చంద్ర‌బాబు విజ‌న‌రీ లీడ‌ర్ : రాష్ట్ర‌ప‌తి

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరు గురించి ప్ర‌త్యేకంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌స్తావించార‌ని తెలిపారు మంత్రి నారా లోకేష్‌. సోమ‌వారం కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీల‌తో క‌లిసి మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి తో భేటీ అయ్యారు. ఈసంద‌ర్బంగా అమ‌రావ‌తి రాజ‌ధానిపై సంత‌కం చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని కోసం తాము ప‌డిన క‌ష్టం గురించి ఏక‌రువు పెట్టారు నారా లోకేష్‌. రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబు పిలుపుతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములు రైతులు త్యాగం చేశారని చెప్పారు. గత పాలనలో వారిపై దాడులు జరిగినా, అక్రమ కేసులు పెట్టినా, శాంతియుతంగా రాజధాని కోసం ఉద్యమించారని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. 

కోట్లాది ప్ర‌జ‌ల కోరిక అయిన అమ‌రావ‌తి చ‌ట్టం త‌న హ‌యాంలో రూపొంద‌డం సంతోషంగా ఉంద‌ని, రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణం కోసం తమ భూమిని ఇచ్చారని రాష్ట్రపతి రైతుల త్యాగాలను కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండి పోతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధాని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పథంలో ప‌య‌నించాల‌ని, రాజ‌ధాని ప‌నులు నిర్విఘ్నంగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    Spread the love

    Spread the loveరెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మి త‌ర‌పున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నిక‌లకు సంబంధించి…

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    Spread the love

    Spread the loveకాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *