బీజేపీ ప‌టిష్ట‌త కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ పిలుపు

అనంత‌పురం జిల్లా : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లా
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. “Nation First – Party Next – Self Last” అనే భావనతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఏకాత్మ భావంతో, దేశ సేవనే పరమావధిగా తీసుకుని ముందుకు సాగుతోందని స్ప‌ష్టం చేశారు.

1985లోనే మాజీ ప్రధానమంత్రి , దివంగ‌త‌ అటల్ బిహారీ వాజపేయి కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించే రోజు వస్తుందని చెప్పారన్నారు. ఈ విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేశారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఆ మాటలు నేటి రాజకీయ పరిణామాల్లో నిజమయ్యాయని అన్నారు. దేశం, సమాజం కోసం కట్టుబడి పని చేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *