పోలవరంను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్

ప‌నులు త్వ‌రిత‌గ‌తిగ‌న చేప‌ట్టాల‌ని ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈమేర‌కు దూకుడు పెంచారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు చైర్మన్ (జి ఆర్ ఎం బి ) పీ దోర్జీ గ్యాంబ సందర్శించారు. ఆయన ప్రాజెక్ట్ అతిధి గృహం వద్ద పీపీఏ సిఈఓ సంజీవ్ వోహ్రా , పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ రవి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ ఆర్ రామచంద్ర రావు, ఈఈ లు డి. శ్రీనివాస్, పీ వెంకటరమణ, కె బాలకృష్ణ, డీఈఈలు శ్రీకాంత్, మాధవరావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి స్వాగతం పలికారు.

కొద్దిసేపు వారితో సమావేశమైన జీఆర్ఎంబీ చైర్మ‌న్ దోర్జీ పోలవరం స్పిల్ వే, ఎగువ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, 2 పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేర‌కు నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని సూచించారు. కేంద్ర స‌ర్కార్ పోల‌వ‌రం ప‌నులు చేప‌ట్టేందుకు నిధులు మంజూరు చేసేందుకు రెడీగా ఉంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *