ఎంపీ సూర్య కామెంట్స్ పై రాముల‌మ్మ కన్నెర్ర‌

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి నిప్పులు చెరిగారు. ఆమె సీరియ‌స్ గా స్పందించారు. క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ తేజ‌స్వి సూర్య పార్ల‌మెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై నోరు పారేసు కోవ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. బేష‌ర‌తుగా నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు రాముల‌మ్మ‌.

పాకిస్థాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయ‌న్నారు. రాష్ట్రం ఊరికే రాలేద‌ని, 1200 మంది బలిదానం చేసుకుంటే వ‌చ్చింద‌ని అన్నారు విజ‌య‌శాంతి. చ‌రిత్ర తెలుసుకోకుండా నోరుంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడితే బాగుండద‌ని అన్నారు. ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా మాట్లాడ‌టం స‌భ్య‌త అనిపించు కోద‌ని పేర్కొన్నారు రాముల‌మ్మ‌.

  • Related Posts

    అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    అమ‌రావ‌తి : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదేన‌ని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజా ప్రతినిధులుగా బాధ్యతగా సభ ముందుకు…

    బీసీఐ చైర్మ‌న్ పై భ‌గ్గుమ‌న్న న్యాయ‌వాదులు

    న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మానన్ కుమార్ మిశ్రా . నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది . బీసీఐ చైర్మ‌న్ రాజీనామా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *