జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్

కొన్ని ష‌ర‌తులు విధించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, వైస్ఆర్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 20 నుంచి మే 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంద‌ని , ఇందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దేశం విడిచి వెళ్లేముందు ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ష్యూరిటీని సీబీఐ అధికారులకు అందజేయాలని ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు ఆదేశించింది.

గ‌తంలో యూపీఐ హ‌యాంలో కొలువు తీరిన స‌మ‌యంలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీబీఐ కోర్టు త‌న‌పై కేసు న‌మోదు చేసింది. ఈ కేసు ఇంకా కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఇదే క్ర‌మంలో త‌న‌పై న‌మోదు చేసిన కేసుల‌కు సంబంధించి స్పందించారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇదంతా కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. రాబోయే రోజుల్లో తాను నిర్దోషిగా బ‌య‌ట ప‌డ‌తాన‌ని, త‌న‌కు ఆ న‌మ్మ‌కం ఉంద‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *