ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు

రవీంద్రభారతిలో తెలంగాణ అస్థిత్వ వేదిక

హైద‌రాబాద్ : వంద‌లాది మంది బ‌లిదానం చేయ‌డంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ప‌ది సంవ‌త్స‌రాల పాటు ఆత్మ గౌరవం భంగం వాటిళ్ల‌కుండా ప్ర‌య‌త్నం చేశారు బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్. కానీ అనూహ్యంగా దొర చేసిన నిర్వాకం కార‌ణంగా ప్ర‌జ‌లు ఛీ కొట్టారు. ఆపై అహంకారానికి చెక్ పెట్టారు. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీకి ప‌వ‌ర్ ను అప్ప‌గించారు. తీరా రేవంత్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో అస్తిత్వం అన్న‌ది లేకుండా పోయింది. ఈ త‌రుణంలో మేధావులు మ‌ళ్లీ మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు. ఇందుకు కీల‌క‌మైన తెలంగాణ మేధావులు ముందుకు వ‌చ్చారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అప‌ర మేధావి వి. ప్ర‌కాష్.

శుక్ర‌వ‌రాం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ అస్థిత్వ వేదిక సమావేశం జ‌రిగింది. 14 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ 12 ఏళ్ల తర్వాత తెలంగాణ అస్థిత్వంపై దాడి జరుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికీ చంద్రబాబుతో పాటు ఆంధ్రా నాయకులు మన మీద దుర్భాష లాడుతున్నారని ఆరోపించారు. తాజాగా బీజేపీకి చెందిన క‌ర్ణాట‌క ఎంపీ తేజ‌స్వి సూర్య పార్ల‌మెంట్ సాక్షిగా నోరు పారేసుకున్నారు. మన సంస్కృతి ప్రతీకలు మాయమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జలవనరులకు సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి నెల‌కొంద‌ని పేర్కొన్నారు రిటైర్డ్ ఇంజినీర్ శ్రీధర్ రావు దేశ్ పాండే.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *