సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏయూ అభివృద్ది కోసం రూ. 500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఏయూ స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. ఇక్కడ ఆర్టీఐహెచ్ ఏర్పాటు చేశాం. భవిష్యత్ డేటా సెంటర్, ఏఐ, క్వాంటం రంగాలదనని అన్నారు సీఎం. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువు. చదువుతో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం వారికి వస్తుందన్నారు. ఏయూ చాలా సుందరమైన ప్రాంతం. ఒత్తిడి ఉన్నప్పుడు సముద్ర తీరంలో వాకింగ్ చేస్తే రిలాక్స్ అవుతాం. మీరంతా అదృష్టవంతులు. ఇక్కడ చదువుకుంటే ఎంత బావుటుందో అనే ఆలోచన వస్తోందన్నారు.
ఈ యూనివర్సిటీ భావితరాల నాయకులను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. వీసీకి టార్గెట్ ఇస్తున్నానని, ఏయూ దేశంలో టాప్ 5లో ఉండాలని నా ఆకాంక్ష అని పేర్కొన్నారు. జీఎంఆర్, మోహన్ రెడ్డి, లారస్ సత్యానారాయణతో పాటు మరికొందరు వ్యాపారులు ఉన్నారని అన్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో రూపాయి సాయం అందించినా రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ వస్తుందని చెప్పారు. వందేళ్ల చరిత్ర రోజు చెప్తున్నా, రాబోయే వందేళ్లలో ఏయూ మరో చరిత్ర సృష్టిస్తుందన్నారు. బెస్ట్ బ్రాండ్ క్రియేట్ చేస్తుందని సీఎం చెప్పారు. నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు ముందుకొచ్చాం అని ప్రకటించారు.






