దిగ్గ‌జ సంస్థ‌ల‌తో క‌లిసి క్వాంటం వ్యాలీ : సీఎం

ఏపీలో ఏర్పాటు చేస్తామ‌న్న చంద్ర‌బాబు నాయుడు

విశాఖ‌పట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు. క్వాంటం వ్యాలీతో ఇక్కడ ఓ ఎకో సిస్టం ఏర్పాటు అవుతోందని తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదన తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయని ఈ పరిస్థితుల మధ్య వచ్చే 10 ఏళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. దానికి అనుగుణంగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్ గా మారాలన్నారు.

ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందిస్తున్నామని త్వరలో ఈ వ్యవస్థను మొత్తం దేశానికీ అమలు చేసేందుకు అస్కారం ఉందని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఏమేరకు ఈజ్ ఆఫ్ లివింగ్ ను చేరువ చేశామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో బీపీఓ విధానాన్ని అంది పుచ్చుకోవటం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని ఇప్పుడు కొన్ని యాప్ ల ద్వారా వచ్చే ఆర్ధిక ప్రయోజనాలు విదేశాలకు వెళ్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

టెక్నాలజీలో మరో కీలకమైన అంశంగా సెమికండక్టర్ల పరిశ్రమ పైనా దృష్టి పెట్టాలని అన్నారు. ఓ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించటంపై ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఏపీ కూడా ప్రధాన భాగస్వామి అవుతుందని నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఏపీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ తో పాటు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    నేనే సీఎం నేనే సుప్రీం : సిద్ద‌రామ‌య్య

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి సీఎం సిద్ద‌రామ‌య్య‌ను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్య‌మంత్రి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అవ‌న్నీ పుకార్లు త‌ప్ప వాస్త‌వం కాద‌న్నారు.…

    బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *