కేరళలో యూడీఎఫ్ విజయంపై శశి థరూర్
కేరళ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూడీఎఫ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సుదీర్గ కాలం పాలన సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ కు ప్రజలు మంగళం పాడారు. ఈ సందర్బంగా ఇంకా సీఎం ఎవరనేది తేలక పోయినప్పటికీ ప్రజలు 102 సీట్లను కట్టబెట్టడం పట్ల స్పందించారు శశి థరూర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలు సాధించిన విజయం. చరిత్రలో ఎవరూ శాశ్వతంగా ఉండాలని అనుకోవడం పొరపాటు. ప్రజలు ఏది తలుచుకుంటే వారికే ఓటు వేస్తారని తేలి పోయింది.
ఎవరైతే ప్రజల వద్ద ఉంటారో వారే విజయం సాధిస్తారని మరోసారి తేలి పోయింది ఈ ఫలితాలను బట్టి చూస్తే. ఈ విజయం మామూలు గెలుపు కాదన్నారు. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయి. వాటి గురించి కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా తీర్పును తాము శిరసా వహిస్తామని, ఇది ప్రతి ఒక్కరి విజయంగా ఆయన అభివర్ణించారు. ఎందుకంటే ప్రజలు లేక పోతే నాయకులు లేరన్నారు. వారి తీర్పు మాకు ఒక బూస్ట్ లాగా పని చేస్తుందని చెప్పారు.





