స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలుగా భావించాలని అన్నారు సీఎం చంద్రాబు నాయుడు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంతో ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యం అన్నారు. లాస్ట్ మైల్ లో ఉండే ఉద్యోగిని కూడా మోటివేట్ చేస్తే అద్భుతంగా పని చేయగలరు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి 0.30 పైసల మేర కొనుగోలు వ్యయం తగ్గించాం. మరో 0.30 పైసలు త్వరలోనే తగ్గిస్తాం… తొలిసారి ట్రూ డౌన్ చేయగలిగాం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాం… ఆన్ లైన్ లో పన్నులు కట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి టాపర్ల ఫోటోలతో యాడ్ ఇచ్చాం. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చాటి చెప్పాం. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ దిశగా అడుగులు వేస్తున్నాం.
అన్ని రంగాల్లో… అన్ని వ్యవస్థల్లో ఏపీ పనితీరు బెంచ్ మార్క్ గా మారాలి. జిల్లాలు, కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి. జిల్లాల్లో అమలు చేసే ఉత్తమ పద్దతులను బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేస్తాం.. ఆ కలెక్టర్లనే వాటికి నోడల్ ఆఫీసరుగా పెడతాం. సీయింగ్ ఇజ్ బిలీఫ్ అనే విధానంలో 3 రోజుల కార్యదర్శులు, 6 రోజులు హెచ్వోడీలు, 8 రోజులు కలెక్టర్లు ఫీల్డ్ కు వెళ్లాలి. సామాజిక మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలి. రిజల్ట్ ఓరియేంటేషనుతో ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఆఫీస్ టెల్స్ యూ డేటా… ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్.. దీన్ని గుర్తు పెట్టుకోవాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ స్లోగన్… గవర్నెన్స్ డిసైడ్స్ ద స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఫైల్స్ షుడ్ నాట్ మూవ్… రిజల్ట్స్ షుడ్ మూవ్.. అప్పుడే ప్రజలకు మంచి సేవలు అందుతాయి అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.






