కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం

హైద‌రాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లీ అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్ట్ మెట్లు ఎక్కింది.
ఇదిలా ఉండ‌గా తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి లతో పాటు పలు మీడియా సంస్థలకు.. డిజిటల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

తనకు సంబంధం లేని మైక్రో ఫైనాన్స్ వివాదంలో తనపై అసత్య ప్రచారం చేశారంటూ పిటిష‌న్ లో పేర్కొంది మంగ్లీ. తన పరువు కి నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశారంటూ వాపోయింది సింగ‌ర్ మంగ్లీ. ముందస్తు ప్రాణాలికలతో కొందరు వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంది. దీని కార‌ణంగా తన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయా లింకులను వెంటనే తొలగించాలని.. భవిష్యత్తులో తనపై అసత్య ప్రచారం చేయకుండా నిరోధించాలని కోర్టును కోరింది.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *