సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో శుక్ర‌వారం జ‌రిగిన రెండో రోజు జిల్లా క‌లెక్ట‌ర్ల స‌దస్సుకు అధ్య‌క్ష‌త వ‌హించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ స‌మావేశానికి రాష్ట్రంలోని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి అనిత వంగ‌లపూడి. అపార‌మైన అనుభ‌వం క‌లిగిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో రాష్ట్రం అన్ని రంగాల‌లో ముందుకు వెళుతోంద‌న్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి దిశగా ముందుకు సాగుతోందని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా ఈ స‌ద‌స్సులో సంప‌ద‌పై దృష్టి సారించ‌డం జ‌రిగింద‌న్నారు. సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం సాధ్యం అని సీఎం దిశా నిర్దేశం చేశార‌ని చెప్పారు. ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరిన త‌ర్వాత 23 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జ‌రిగాయ‌న్నారు. వీటి ద్వారా 24 లక్షల ఉద్యోగాల క‌ల్ప‌నే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ప్రజా సమస్యలపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డుల ఆధునీకరణ చేస్తామ‌ని తెలిపారు అనిత వంగ‌ల‌పూడి. గ్రీన్ ఎనర్జీ, AI, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా మారుస్తామ‌న్నారు.

  • Related Posts

    ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం ర‌ద్దు

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన గ‌వ‌ర్న‌ర్ ర‌వి కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా రాష్ట్రంలో…

    కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి

    Spread the love

    Spread the loveస్పష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలుగా భావించాల‌ని అన్నారు సీఎం చంద్రాబు నాయుడు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *