ఖాకీల దాడుల‌పై బీజేపీ చీఫ్ మాధ‌వ్ సీరియ‌స్

Spread the love

కార్య‌క‌ర్త‌ల‌పై దాడులకు పాల్ప‌డితే బాగుండ‌దు

అమ‌రావ‌తి : త‌మ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, నేత‌ల ప‌ట్ల ఏపీ ఖాకీలు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాగే దాడుల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. చూస్తూ ఊరుకోమ‌న్నారు. కడప లో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు అమానుషం గా వ్యవహరించారని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు మాధ‌వ్.

కడప బిజెపి జిల్లా అధ్యక్షుడు పై చేయి చేసుకున్న డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ చీఫ్‌ డిమాండ్ చేశారు . పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అరాచక శక్తుల జోలికి పోకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారా అంటూ పోలీసుల తీరుపై మండి పడ్డారు. డీఎస్పీ అధికారం ఉంద‌ని దాడికి పాల్ప‌డ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ దాడికి సంబంధించిన అంశాన్ని స‌ర్కార్ దృష్టికి తీసుకు వెళుతున్నామ‌ని చెప్పారు. ఈమేరకు పోలీసులు చేయిచేసుకున్న వీడియో ను మీడియా కు విడుదల చేశారు.

  • Related Posts

    టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ పుదుచ్ఏచ‌రి : త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మా…

    అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు

    Spread the love

    Spread the loveఇవాళ త‌ల్లుల దినోత్స‌వం సంద‌ర్బంగా అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ త‌ల్లుల దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *