చంద్ర‌బాబు నివాసంలో ప్ర‌ధాని మోదీ

శ్రీవారి చిత్ర‌ప‌టం బ‌హూక‌రించిన సీఎం

హైద‌రాబాద్ : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయ‌న ఏపీకి సీఎం. కానీ అంతా ఇక్క‌డే ఉంటారు. ఇక ప్ర‌ధాని స్వ‌యంగా ఆయ‌న‌ నివాసానికి వెళ్లారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్న మోదీ.. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు.

ప్రధాని రాకను తమ కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవంగా, చిరస్మరణీయ క్షణంగా చంద్రబాబు అభివర్ణించారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం.. విభజన హామీల అమలుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాని మోదీకి జ్ఞాప‌కంగా క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి చిత్ర ప‌టాన్ని బ‌హూక‌రించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *